Sunday, March 9, 2025

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌. కేంద్ర ప్రభుత్వం హోలీ పండగకు ముందే డీఏ పెంచాలని నిరణించింది. రెండు శాతం మేర డీఏ పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 1.2 కోట్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ప్రతి సంవత్సరం జనవరి, జులైలో రెండు సార్లు డీఏ పెంచుతుంది కేంద్రం. ప్రతి ఏటా జనవరి నెలకు సంబంధించి డీఏ పెంపును హోలీ సమయంలో ప్రకటిస్తుంది ప్రభుత్వం. జులై నెలకు సంబంధించిన డీఏ పెంపును దీపావళి సమయంలో లేదా నవంబర్ నెలలో ప్రకటిస్తారు. కానీ.. ఈ ఏడాది హోలీ పండగకు ముందే ఫిబ్రవరి నెలలోనే డీఏ పెంపు ప్రకటించనున్నారు.
2024 సంవత్సరం మార్చి నెలలో హోలీ సందర్భంగా డీఏ 46 శాతం నుంచి 50శాతానికి పెంచింది ప్రభుత్వం. ఆ తర్వాత అక్టోబర్ లో మళ్ళీ 3 శాతం డీఏ పెంపు ప్రకటించింది. ఈ క్రమంలో ప్రస్తుతం డీఏ 53 శాతంగా ఉంది. ఇక ఇప్పుడు రెండు శాతం డీఏ పెంపు ఉంది. దీంతో డీఏ 55 శాతం పెరుగుతుంది. డీఏని రెండు శాతం పెంచితే.. రూ.18 వేలు బేసిక్ పే ఉన్నట్లయితే.. ఉద్యోగి జీతం రూ. 360 పెరుగుతుంది. అదే.. డీఏ 3శాతం పెంచితే రూ. 540 మేర ఉద్యోగి జీతం పెరుగుతుంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com