Thursday, January 2, 2025

రైతులతో చర్చలకు సిద్ధ్దమైన కేంద్రం

జనవరి 3న చర్చలకు ‘సుప్రీమ్‌’ ఆదేశం

రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమైంది. ఎంఎస్‌పిపై మొదటి రౌండ్‌ చర్చల కోసం జనవరి 3న సుప్రీం కమిటీ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం)ని ఆహ్వానించింది. రిటైర్డ్‌ జస్టిస్‌ నవాబ్‌ సింగ్‌ అధ్యక్షతన ఏర్పడిన ఈ సుప్రీంకోర్టు కమిటీ రైతులతో చర్చలు జరపనుంది. ఎస్‌కెఎం ఈ ఆహ్వానాన్ని అంగీకరించిందని ఎస్‌ కఎం జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు రందర్‌ సింగ్‌ పాటియాలా తెలిపారు.కాగా పంటలకు ఎంఎస్‌పి (కనీస మద్దతు ధర)కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధ హా కల్పించాలంటూ పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.

మరోవైపు సంయుక్త కిసాన్‌ మోర్చా (రాజకీయేతర విభాగం), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చాలు డిసెంబర్‌ 30 బంద్‌కు పిలుపునిచ్చాయి.  సోమవారం ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు బంద్‌ కొనసాగనుంది. బంద్‌తో వందేభారత్‌ సహా 150 రైళ్లు రద్ద య్యాయి. 200కి పైగా ప్రదేశాలలో చక్కాజామ్‌ల కారణంగా బస్సులు నిలిచిపోయాయి. విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ఎంఎస్‌పి సహా రుణమాఫీ, విద్యుత్‌ చార్జీలు, రైతులకు, రైతు కూలీలకు పింఛన్ల వంటి 13 డిమాండ్లను పరిష్కరించాలంటూ రైతు నేత దల్లేవాలే గత 35 రోజులుగా నిరాహార దీక్ష చేపడుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com