ఒకప్పటి స్టార్ హీరోయిన్ లేడీ అమితాబ్ విజయశాంతి తెలియనివారుండరు. అప్పట్లో అత్యధిక పారితోషికం అందుకున్న ఏకైక హీరోయిన్‌గా పేరుగాంచింది. కమర్షియల్ చిత్రాలతో పాటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. స్టార్ హీరోలకు దీటుగా ఆమె సినిమాలు థియేటర్లలో రచ్చ చేసేవంటే అమె క్రేజ్, రేంజ్ ఎలా ఉండేదో అర్ధం చేసుకోండి. ఒకానొక సమయంలో రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈమె కొంత కాలం గ్యాప్ తరువాత ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం కళ్యాణ్‌రామ్ చిత్రంలో అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో అమ్మ పాత్ర పోషించింది. వందల చిత్రాల్లో నటించి మెప్పించిన ఈమె స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలతో కలిసి ఎక్కువ సినిమాల్లో నటించింది. హిట్ కాంబినేషన్‌గానూ నిలిచింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసే సమయంలో వారికే పోటీ ఇచ్చింది విజయశాంతి.
అయితే ఆమె లీడ్‌గా మూవీస్ చేసే సమయంలో చిరంజీవి, బాలయ్యలతో సినిమాలు చేయలేదు. మళ్లీ ఇప్పుడు ఆమె మూవీస్ చేస్తున్న నేపథ్యంలో చిరు, బాలయ్యలతో సినిమాలు చేసే అవకాశం ఉందా? అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చింది విజయశాంతి. చిరు, బాలకృష్ణలతో మళ్లీ సినిమాలు చేయడం గురించి విజయశాంతి మాట్లాడుతూ, ఇకపై తాను వారితో సినిమాలు చేయనని స్టేట్‌మెంట్ ఇచ్చింది. తాను మున్ముందు సినిమాలు చేయబోనని స్పష్టం చేసింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎంపికైన నేపథ్యంలో బాధ్యతలు పెరిగాయి. ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉంటాం. ఇప్పుడు సినిమాలు చేయడానికి కుదరదు అని, అందులోనూ చిరంజీవి, బాలయ్యలతో సినిమాలు చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది.