Sunday, October 6, 2024

గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లు

తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 జిల్లాలకు ఛైర్మన్‌లను నియమించింది. త్వరలో మిగతా జిల్లాలకు గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను నియమిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది. కులాల వారీగా చూసుకుంటే ప్రకటించిన వాటిలో రెడ్డి సామాజికవర్గం నుంచి ఐదు మంది ఉండగా.. గౌడ్ సామాజికవర్గం నుంచి ఇద్దరు.. ముస్లిం నుంచి ఒకరికి పదవులు లభించాయి. త్వరలో మిగతా జిల్లాలకు గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను నియమిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

వివరాలు
* నిర్మల్- సయ్యద్ అర్జుమంద్ అలీ
* సిరిసిల్ల- నాగుల సత్యనారాయణ గౌడ్
* కరీంనగర్- సత్తు మల్లయ్య
* రంగారెడ్డి- ఎలుగంటి మధుసూధన్ రెడ్డి
* వనపర్తి – జి. గోవర్ధన్
* సంగారెడ్డి- గొల్ల అంజయ్య
* కామారెడ్డి- మద్ది చంద్రకాంత్ రెడ్డి
* మెదక్- సుహాసిని రెడ్డి
* నారాయణ్‌పేట్ – వరాల విజయ్ కుమార్
* నాగర్ కర్నూల్ – జి. రాజేందర్
* వికారాబాద్- శేరి రాజేశ్ రెడ్డి
* మహబూబ్‌నగర్- మల్లు నరసింహారెడ్డి
* జోగులాంబ గద్వాల- నీలి శ్రీనివాసులు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular