Tuesday, November 19, 2024

చక్రస్నానం కోసం టిటిడి విస్తృత ఏర్పాట్ల

సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు

తిరుమల : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శనివారం చక్రస్నానం కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

వేలాది మంది భక్తులు స్వామి పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించారు.

ఈ ఏడాది టీటీడీ భక్తులకు చేసిన ఏర్పాట్లలో భాగంగా మహిళలలు, పురుషులు పుష్కరిణి స్నానం అనంతరం దుస్తులు మార్చుకునేందుకు వీలుగా అదనపు టెంట్‌లను ఏర్పాటు చేసింది.

అదే విధంగా పుష్కరిణి స్నానం కొరకు తెల్లవారుజాము నుండి వేచి ఉండే భక్తులకు వాటర్ బాటిల్స్ మరియు వేడి బాదం పాలను కూడా అందించారు.

 

టీటీడీ ప్రత్యేకంగా చక్రస్నానం కోసం నియమించిన సీనియర్ అధికారుల పర్యవేక్షణలో మొత్తం 300 మంది శ్రీవారి సేవకులు భక్తులకు తాగునీరు, బాదం పాలు, పుష్కరిణి పర్యవేక్షణ సేవలందించారు.

ఈ ఏడాది పుష్కరిణిలో వేచి ఉండే భక్తులకు తెల్లవారుజాము నుంచే వేడి వేడి బాదం పాలు అందించడం, తాగునీటి బాటిల్స్ పంపిణీ చేయడం, పుణ్యస్నానం అనంతరం దుస్తులు మార్చుకునేందుకు అదనపు టెంట్లు ఏర్పాటు చేయడంపై టీటీడీ సేవలను భక్తులు కొనియాడారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular