Thursday, December 26, 2024

సంగారెడ్డికి విచ్చేసిన చంద‌నా బ్ర‌ద‌ర్స్‌

సంగారెడ్డికి బ్రాండెడ్ షోరూములు విచ్చేస్తున్నాయి. ఇటీవ‌ల చంద‌నా బ్ర‌ద‌ర్స్ షోరూం ఆరంభ‌మైంది. ప్ర‌ముఖ న‌టి అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ చేతుల మీదుగా ఈ షోరూమ్ అట్ట‌హాసంగా ఆరంభ‌మైంది. హైద‌రాబాద్‌లో పేరెన్నిక గ‌ల మ‌రికొన్ని బ్రాండెడ్ షోరూములు సంగారెడ్డిలో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. అదేవిధంగా, ఇక్క‌డి మెయిన్ రోడ్డులోనూ ఒక షాపింగ్ మాల్ క‌మ్ మ‌ల్టీప్లెక్స్‌ను ఆరంభించేందుకు న‌గ‌రానికి చెందిన ఒక నిర్మాణ సంస్థ స‌న్నాహాలు చేస్తోంద‌ని తెలిసింది. కందిలో ఐఐటీ ఏర్పాటు వ‌ల్ల సంగారెడ్డిలో షాపింగ్ మాళ్లు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్ల‌కు విప‌రీత‌మైన డిమాండ్ పెరిగింది. వారాంతంలోనే కాకుండా ప‌ని దినాల్లోనూ ఇక్క‌డి ఫుడ్ కోర్టులకు గిరాకీ అధికంగా ఉంటుంది. ఈ క్ర‌మంలో అనేక ఫుడ్ కోర్టులు సంగారెడ్డి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో ఏర్పాటు అవుతున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com