Saturday, April 5, 2025

నేడు ఎన్టీఆర్‌ జిల్లాలో బాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలో పర్యటించనున్నారు. బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముప్పాళ్లలో ఏర్పాటు చేస్తున్న ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజలతో ముచ్చటించనున్నారు. ఉదయం 10:15 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 11:30 గంటలకు చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికిన తర్వాత రోడ్డు మార్గంలో బయలుదేరి ముప్పాళ్ల గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చేరుకుంటారు. అనంతరం 11:46 గంటలకు నిమ్మతోటలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ చేయడంతో పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2:15 గంటలకు ముప్పాళ్లలోని వేబ్రిడ్జ్ స్థలం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం 3:40 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని తిరుగు ప్రయాణం అవుతారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com