చంద్రయాన్-3 చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై ఇప్పటి వరకు ఏ దేశం దిగని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపి మీసం మెలేసింది. సాయంత్రం 5.44 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలవ్వగా 6.04 గంటలకు చందమామను చంద్రయాన్-3 ముద్దాడి అంతరిక్షంలో భారత ప్రతిష్టను చాటి చెప్పింది. ఇక నేటి నుంచి 14 రోజుల పాట జాబిల్లిపై రోవర్ పరిశోధనలు జరపనుంది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ క్షేమంగా దిగడంతో ఇస్రోలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. శాస్త్రవేత్తలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.