Monday, April 21, 2025

సంఖ్యా శాస్త్రం, వాస్తు శాస్త్రానికి అనుగుణంగా సచివాలయంలో మార్పులు, చేర్పులు

  • మంగళవారం నుంచి నార్త్ గేట్ నుంచి లోపలికి ఎంట్రీ అయిన ముఖ్యమంత్రి
  • సచివాలయంలోని ఆరో అంతస్తులోనూ పలు వాస్తు మార్పులు
  • ఇప్పటికే కాన్వాయ్‌లోని వాహనాలు నలుపు రంగులోకి….
  • పలువురు మంత్రులకు టయోటా ల్యాండ్ క్రూయిజర్లు

తెలంగాణ సచివాలయంలోకి వచ్చే మార్గాన్ని సిఎం రేవంత్‌రెడ్డి మార్చుకున్నారు. ఇప్పటికే సంఖ్యా శాస్త్రం, వాస్తు శాస్త్రానికి అనుగుణంగా సిఎం రేవంత్‌రెడ్డి పలు మార్పులు చేపట్టారు. సింహద్వారం నుంచి కాకుండా నార్త్ గేటు నుంచి మంగళవారం ఆయన లోనికి వచ్చారు. సిఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సచివాలయంలోకి వెళ్లేందుకు తూర్పువైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని సిఎం రేవంత్ వినియోగించారు.

వాస్తు మార్పుల్లో భాగంగా పశ్చిమం వైపు ఉన్న గేటు ద్వారా లోపలికి వస్తున్నారని, ఈశాన్యం వైపు ఉన్న గేటు ద్వారా బయటకు వెళ్లిపోతున్నారని సచివాలయ వర్గాలు తెలిపాయి. అటు సిఎం రేవంత్‌రెడ్డి కార్యాలయానికి సంబంధించి ఆరో అంతస్తులోనూ పలు వాస్తు మార్పులు జరు గుతున్నాయి. ఇంటీరియర్ డిజైన్‌తో పాటు ఫర్నీచర్‌లో కూడా మార్పులు, చేర్పులు చేపట్టారు. దీంతోపాటు సిఎం కాన్వాయ్ తెలుపు నుంచి నలుపు రంగులోకి మార్చుకోగా, కాన్వాయ్ సంఖ్యను తన అదృష్ట సంఖ్య 9కి పెంచుకున్నారు. కాన్వాయ్ వాహనాలపై 9వ నెంబర్ వచ్చేట్టుగా సిఎం రేవంత్ మార్చుకున్నారు.

తెలంగాణ మంత్రులకు కొత్త వాహనాలు
తెలంగాణ మంత్రులకు కొత్త వాహనాలను కేటాయించారు. పలువురు మంత్రులకు టయోటా ల్యాండ్ క్రూయిజర్లు ప్రభుత్వం అందజేసింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో సిఎం కాన్వాయ్ కోసం కొత్త వాహనాల కొనుగోలు చేయగా ఇటీవల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ధిన అనంతరం మంత్రులకు ఈ వాహనాలను ప్రభుత్వం కేటాయించింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com