Saturday, June 29, 2024

ఇంజినీరింగ్​ కౌన్సెలింగ్​ షెడ్యూల్​లో మార్పులు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌, బీఈ సీట్ల భర్తీకి కోసం నిర్వహించనున్న కౌన్సెలింగ్‌లో మార్పులు చోటు చేసుకున్నది. షెడ్యూల్‌ ప్రకారం.. ఈ నెల 27 నుంచి మొదలు కావాల్సిన కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. మళ్లీ జూలై 4 నుంచి ఇంజినీరింగ్‌ తొలివిడత ప్రక్రియ మొదలవనున్నది. జూలై 6 నుంచి 13 వరకు తొలి విడత సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, 8వ తేదీ నుంచి 15 వరకు తొలి విడత వెబ్‌ ఆప్షన్స్‌, 19న ఇంజినీరింగ్‌ తొలి విడత సీట్లను కేటాయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇక, జూలై 26 నుంచి ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని.. 27న రెండో విడత కౌన్సెలింగ్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. జూలై 27, 28 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్స్‌కు అవకాశం ఇస్తామని.. 31న రెండో విడత సీట్ల కేటాయింపు, ఆగస్ట్‌ 8 నుంచి మూడో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్ట్‌ 9న మూడో విడత కౌన్సెలింగ్‌కు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించి.. 9, 10 తేదీల్లో వెబ్‌ ఆప్షన్స్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. అదే నెల 13న ఇంజినీరింగ్‌ మూడో విడత సీట్ల కేటాయించనున్నారు. ఇక ఆగస్టు 21 నుంచి కన్వీనర్‌ కోటా ఇంటర్నల్‌ స్లైడింగ్‌ ఉండనున్నది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular