Thursday, June 5, 2025

ఛార్జీల పెంపు ఎఫెక్ట్ మెట్రోకు తగ్గిన డిమాండ్​

మే 17 నుంచి మెట్రో యాజమాన్యం ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. అయితే అదే ఇప్పుడు మెట్రోకు పెను సంకటంగా మారినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఛార్జీల పెంపు భారం మెట్రో ప్రయాణాలపై పడింది. దీంతో ప్రయాణించే వారి సంఖ్య 5 శాతం మేర తగ్గింది. నిరసనలు వ్యక్తం కావడంతో మే 25 నుంచి 10 శాతం మేర ఛార్జీలు తగ్గించినా సరే సగటున రోజుకు దాదాపు 25 వేల వరకు ప్రయాణికులు తగ్గిపోయారు. ప్రస్తుతం సోమవారం రోజు ప్రయాణికుల సంఖ్య 4.60 లక్షలకు మించడం లేదు. కొన్ని సోమవారాల్లో అయితే ఆ సంఖ్య 4.40 లక్షలు, అంతకంటే తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మెట్రో ఛార్జీల పెంపుతో ప్రయాణికులు మరింత దూరం అయ్యారు. కేవలం ఉదయం, సాయంత్రం మినహా మిగతా సమయాల్లో చాలా ట్రిప్పులు మెట్రోలు ఖాళీగానే దర్శనం ఇస్తున్నాయి. వారాంతాల్లో కూడా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి.
మెట్రో ప్రయాణికులు తగ్గడం పట్ల మెట్రో వర్గాలు వేరేలా స్పందిస్తున్నాయి. ఈ ఛార్జీల పెంపుతో ప్రయాణికుల సంఖ్య కొంత తగ్గినా ఇది కేవలం మూడు నెలలేనని, తర్వాత పరిస్థితి సర్దుకుంటుందని తెలుపుతున్నారు. ఛార్జీల పెంపుతోనే తగ్గారా లేదా అనేది ఆ సమయానికి స్పష్టత వస్తుందని వారు చెబుతున్నారు. సాధారణంగానే ఏప్రిల్​ నుంచి జూన్​ మధ్య వరకు ప్రయాణికుల సంఖ్య తక్కువగానే ఉంటుందని, విద్యార్థులకు సెలవులు, సొంతూళ్లకు వెళ్లడం వంటి కారణాలను చెబుతున్నారు. మళ్లీ ఆగస్టు నుంచి ఈ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని, ఈసారి కూడా అలానే ఉంటుందని మెట్రో వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రద్దీకి తగ్గట్లుగా అదనపు కోచ్​ల కొనుగోలు
ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో రద్దీపై ఫిర్యాదులు తగ్గిపోయాయని మెట్రో వర్గాలు అంటున్నాయి. ఇప్పటికీ రాయదుర్గం-అమీర్​పేట మార్గంలో సాయంత్రం వేళ రద్దీ ఉంటుందన్నారు. ఆగస్టు తర్వాత రద్దీ పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో అదనపు కోచ్​ల కొనుగోలుపై మెట్రో యాజమాన్యం దృష్టి పెట్టింది. ఛార్జీల పెంపుతో కొంత రెవెన్యూ వస్తుండటంతో కోచ్​ల కొనుగోలుపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అదనపు కోచ్​ల కొనుగోలు ఎంతవరకు వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అడగ్గా, 10 అదనపు కోచ్​ల కొనుగోలుకు చర్యలు చేపట్టామని మెట్రో అధికారులు కేంద్రానికి సమాధానం చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com