Thursday, May 8, 2025

పాతబస్తీలో అందాల తారల హెరిటేజ్‌ వాక్‌

హైదరాబాద్ లో నిర్వహించే మిస్ వరల్డ్ ఈవెంట్ తో చార్మినార్, లాడ్ బజార్ లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కనుంది. మిస్ వరల్డ్ ఈవెంట్ లో భాగంగా ఈ నెల13 న సాయంత్రం హైదరాబాద్ తో పాటు చార్మినార్ , లాడ్ బజార్ సాంస్కృతిక వైభవాన్ని,వైవిధ్యాన్ని చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేలా హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. లాడ్ బజార్ లో మిస్ వరల్డ్ ప్రతినిధులు స్థానిక కళాకారులతో మాట్లాడనున్నారు. 120 దేశాల మిస్ వరల్డ్ ప్రతినిధులు హాజరయ్యే ఈ హెరిటేజ్ వాక్ ను 150 కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఈ ఈవెంట్ ను తిలకిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున విదేశీ పర్యాటకులను తెలంగాణకు ఆకర్షించేలా ప్రణాళిలు సిద్ధం చేశారు. చారిత్రక చార్మినార్ కట్టడం, లాడ్ బజార్ ప్రత్యేకతలను మిస్ వరల్డ్ ప్రతినిధులు వివరించి వరల్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్ గా ప్రమోట్ చేయనున్నారు.

లాడ్ బజార్ ప్రత్యేకత
నిజాం పాలనలో వెలసినలాడ్ బజార్ కు 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. బాంగిల్స్ రాజధానిగా ఈ ప్రాంతం సుప్రసిద్ధం. రంగురంగుల పేర్లు, మణులు, జరీ పనితో కూడిన సాంప్రదాయిక గాజులు ఇక్కడి ప్రత్యేకత. ప్రతి పెళ్లి సీజన్లో ఇది జనాల ఆకర్షణకేంద్రం. ఇక్కడ నాణ్యమైన ముత్యాలు, నగలు సరసమైన ధరల్లో లభిస్తాయి.
హస్తకళల హబ్ గా కూడా పేరుంది. చిత్రకళ, నకాశీ పని, ఇస్లామిక్ ఆర్ట్ వంటి సాంప్రదాయిక హస్తశిల్ప వస్తువులు ఇక్కడ లభిస్తాయి. ఇత్తార్ (సువాసనలు), ఖురాన్ ప్రతులు, సాంస్కృతిక వస్తువులతో ఇది ఇస్లామిక్ ఆర్ట్ కి ప్రతీకగా ఉంది. ఓల్డ్ సిటీ యొక్క ఇటుకల రోడ్లు, సజీవమైన దుకాణాలు, సాంస్కృతిక సువాసనలు ప్రతి ఒక్కరినీ ముగ్ధులను చేస్తాయి.

చార్మినార్ ప్రత్యేకత
1591లో కుతుబ్ షాహీ రాజు ముహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన చార్మినార్, హైదరాబాద్ సాంస్కృతిక గర్వాన్ని ప్రతిబింబిస్తుంది. నాలుగు మినార్లతో కూడిన ఈ స్మారకం ఇండో-ఇస్లామిక్ డిజైన్ కు నిదర్శనం. ప్లేగు నివారణ తర్వాత నగర స్థాపనకు గుర్తుగా నిర్మించబడింది. 56 మీటర్ల ఎత్తు, 45 మీటర్ల వెడల్పుతో ఇది హైదరాబాద్ కు “హార్ట్” గా ఉంది.మినార్ల పై నుంచి పాత నగరం, మక్కా మసీదు అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి. ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు కోసం ప్రతిపాదించబడింది. ఇది నిజాం కాలం నుంచి నేటి వరకు హైదరాబాద్ ఐకాన్ గా ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com