Sunday, April 20, 2025

ధరణి సమస్యలకు యాచారం మండలంతో చెక్

  • ఫైలెట్ ప్రాజెక్టుగా 10 గ్రామాల్లోని రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • 4,465 సర్వే సబ్ డివిజన్లకు సంబంధించి భూ సమస్యలు
  • ఉన్నట్టు గుర్తించిన లీఫ్స్ సంస్థ
  • త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించనున్న ధరణి కమిటీ సభ్యులు

ధరణి సమస్యల గుర్తింపు, వాటి పరిష్కారానికి లీఫ్స్ సంస్థ ఆరు నెలలు శ్రమించి ప్రభుత్వానికి పరిష్కార మార్గాలను చూపించింది. లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో యాచారం మండలంలో భూమి సమస్యల పరిష్కారానికి పైలట్ కార్యక్రమంగా దీనిని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఈ సంస్థ పది గ్రామాల్లో అధ్యయనం చేసింది. పది మంది న్యాయవాదులు, పారా లీగల్ వర్కర్స్ ఆయా గ్రామాల్లో అక్కడే బస చేసి అక్కడి రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలను ఒక దగ్గరికి చేర్చి ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యలపై సమగ్ర నివేదికను రూపొందించారు. అందులో భాగంగా మొదటి దశలో ప్రతి గ్రామంలో భూ న్యాయ శిబిరం నిర్వహించి భూమి సమస్యలను గుర్తించారు. రెండో దశలో సమస్యలు ఉన్న వ్యక్తి దగ్గర ఉన్న పత్రాలు, రెవెన్యూ రికార్డులు పరిశీలించి నివేదిక రూపొందించినట్లు లీఫ్స్ సంస్థ అధ్యక్షుడు, భూ చట్టాల నిపుణులు భూమి సునీల్ పేర్కొన్నారు.

10 గ్రామాల్లో 2,114 మంది రైతుల భూ సమస్యలు
ఈ పది గ్రామాల్లోనే 2,114 మంది భూ సమస్యలను ఎదుర్కొంటుండగా ఒకరు ఒకటి కంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నారని భూమి సునీల్ తెలిపారు. ఈ సమస్యల్లో ఎక్కువగా 4,465 సర్వే సబ్ డివిజన్లకు సంబంధించి భూమి సమస్యలు గుర్తించినట్లు ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో ఈ పైలట్ మూడో దశలో భాగంగా సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ సహకారాన్ని కూడా తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ సమస్యల పూర్తి వివరాలతో కూడిన నివేదికను బుధవారం యాచారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి సమక్షంలో లీఫ్స్ సంస్థ అధ్యక్షుడు భూమి సునీల్ ఆర్‌డిఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో లీఫ్స్ ఉపాధ్యక్షుడు జీవన్, లీఫ్స్ న్యాయవాదులు మల్లేష్, అభిలాష్, సందీప్, రవి, యాచారం తహసీల్దార్, లీఫ్స్ సలహాదారు కరుణాకర్ రెడ్డి, మండల రైతులు, రైతు నాయకులు పాల్గొన్నారు.

లీఫ్ సంస్థ ప్రభుత్వానికి చేస్తున్న సిఫారసులు..
రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేకపోవడం వల్ల వారి దరఖాస్తులను మాన్యవల్ గా కూడా స్వీకరించాలి. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో కనీసం నలుగురితో సపోర్టింగ్ టీమ్‌ను ఏర్పాటు చేయాలి.
ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు పెట్టి దరఖాస్తులు స్వీకరించాలి. సింపుల్ ఫార్మట్ ద్వారా రైతుల సమస్యను అడగాలి. దరఖాస్తులకు అవసరమైన డాక్యుమెంట్లు అడిగి తీసుకోవాలి. వాటిపై స్పీకింగ్ ఆర్డర్ రాయాలి. సమస్యలను పరిష్కరించాలి. తిరస్కరించే వాటికి కారణాలు తెలపాలి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com