Monday, March 31, 2025

కరెంట్‌ బిల్లులపై మోసపూరిత కాల్స్‌

అప్రమత్తంగా ఉండండి : ఎస్పీడీసీఎల్‌

విద్యుత్ వాడకం బిల్లలు, బకాయిల పేరుతొ కొంత మంది వ్యక్తులు తమ వినియోగదారులను మెసేజ్ లు, ఫోన్ కాల్స్‌ ద్వారా సంప్రదిస్తున్నారని, విద్యుత్ బిల్లులు, వాటి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని అవి వెంటనే కట్టకుంటే రాత్రిపూట విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నట్లు టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ వెల్లడించారు. అలాంటి మెస్సేజ్‌లు, కాల్స్‌ తమ సంస్థ తరపున చేయడం లేదని, అలాంటి కాల్స్‌వస్తే వెంటనే తమ సంస్థ సిబ్బందిని, అధికారులను సంప్రదించాలని సూచించారు. అలా మెసేజ్ ను నమ్మి ఎవరైనా వారిని సంప్రదిస్తే బ్యాంకు అకౌంట్ మరియు డెబిట్ కార్డు వివరాలు తీసుకుని వారి అకౌంట్ల నుండి నగదును విత్ డ్రా చేసుకుంటూ మోసగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, విద్యుత్ వినియోగదారులు, ప్రజలు ఇలాంటి మోసపూరిత మెసేజ్ లు నమ్మి మోసపోవద్దని సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు. TGSPDCL పంపే సందేశాలలో విభాగం పేరు, USC/సర్వీస్ నంబర్, వినియోగదారుని పేరు, బిల్లు మొత్తం ఉంటాయని, TGSPDCL ఎప్పుడూ మొబైల్ నంబర్ నుండి సందేశాలు పంపదన్నారు.
TGSPDCL ఉద్యోగులు చెల్లింపు రసీదు తప్ప బ్యాంక్ ఖాతా/డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్ వివరాలను ఎన్నడూ సేకరించరని, సంస్థ బిల్లుల చెల్లింపు కోసం సందేశం ద్వారా ఎటువంటి వెబ్‌సైట్ లింక్‌లను పంపదన్నారు. విద్యుత్ వాడకం బిల్లులు, బకాయిల వివరాలను విద్యుత్ బిల్లు ద్వారా వినియోగదారులకు తెలియజేస్తుందని, వినియోగదారులు సంస్థ వెబ్‌సైట్ www.tgsouthernpower.org లేదా TGSPDCL మొబైల్ యాప్ ద్వారా ప్రస్తుత వినియోగ బిల్లులు మరియు బకాయిల సమాచారాన్ని పొందవచ్చని సూచించారు. అంతేగాక సంస్థ రాత్రిపూట విద్యుత్ సరఫరాను నిలిపివేయదన్నారు. విద్యుత్ వినియోగదారులు బ్యాంక్ ఖాతా/క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ వివరాలను ఇతరులతో పంచుకోవద్దని, విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం అనుమానాస్పద లింక్‌లను అనుసరించవద్దని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com