Friday, November 8, 2024

చెన్నైలో మ‌ళ్లీ కుండపోత వర్షం నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

తమిళనాడు రాజధాని చెన్నై లో కుంభవృష్టి కురిసింది. ఒక్కసారిగా కుండపోత వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలు కాలనీలు చెరువుల్లా మారిపోయాయి. రహదారులు నదులను తలపించాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
భారీ వర్షం కారణంగా వరద పోటెత్తడంతో పలుచోట్ల పార్క్‌ చేసి ఉన్న వాహనాలు కొట్టుకుపోయాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దాంతో చెన్నై నగరపాలక సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. విపత్తును ఎదుర్కొనే చర్యలు చేపట్టారు. వరద కారణంగా ఎక్కడా ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఇటీవ‌ల కూడా చెన్నైలో భారీ వ‌ర్షాలు కురిశాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular