Thursday, December 26, 2024

చెన్నైలో డ్రైవర్‌ రహిత మెట్రో రైల్‌ ట్రయల్‌ రన్‌ నేడు ట్ర‌య‌ల్ ర‌న్‌

చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్ళను నగరంలో నడుపనున్నారు. ఇందులో భాగంగా, మెట్రో రైల్‌ అధికారులు ఈ నెల 26న తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైల్‌ టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. పూందమల్లిలోని టెస్ట్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌లో ఈ రైళ్ళను పరీక్షిస్తారు. చెన్నై నగరంలో ప్రజా రవాణా సులభతరం చేసే చర్యల్లో భాగంగా మెట్రో రైల్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.63,246 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును మాధవరం మిల్క్‌ కాలనీ – సిరుచ్చేరి, లైట్‌ హౌస్‌ నుంచి పూందమల్లి, మాధవరం నుంచి షోలింగనల్లూరు వరకు మూడు మార్గాల్లో నిర్మాణ పనులు సాగుతున్నాయి. అయితే, పూందమల్లి నుంచి లైట్‌ హౌస్‌ మార్గంలో డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్ళను నడపడంపై అధికారులు దృష్టిసారించారు. ఇందుకోసం మూడు బోగీలతో కూడిన 36 మెట్రో రైళ్ళ తయారీ (మొత్తం బోగీలు 108)ని ఆల్‌స్టోమ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ తయారు చేస్తోంది.
ఇందులోభాగంగా తొలి డ్రైవర్‌ రహిత రైలు తయారు చేసిన ఈ కంపెనీ మెట్రో రైల్‌ అధికారులకు గత నెల 22వ తేదీ అప్పగించింది. ఇదే విషయంపై మెట్రో రైల్‌ అధికారులు మాట్లాడుతూ, వచ్చే యేడాది జనవరి నుంచి దాదాపు మూడు నెలల పాటు పూందమల్లి మెట్రో రైల్‌ డిపోలో 900 మీటర్ల వరకు నిర్మించిన టెస్ట్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌పై ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత మరో ఆరు నెలల పాటు పూందమల్లి నుంచి పోరూర్‌ వైపు వెళ్ళే ప్రధాన మార్గంలో కొన్ని కిలోమీటర్ల వరకు ఈ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామని తెలిపారు. పూందమల్లి డిపోలో టెస్ట్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌లో ఈ రైళ్ళ బ్రేక్‌ స్థితిగతులు, బ్రేక్‌ పాయింట్‌, ప్రయాణికుల భద్రత తదితర అంశాలను అధ్యయనం చేస్తామని వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com