Wednesday, May 7, 2025

కాంగ్రెస్​లోకి రంజిత్​రెడ్డి జంప్‌?

టీఎస్​ న్యూస్​: ఒకప్పుడు రెండు జాతీయ పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేసిన గులాబీ పార్టీకి ఇప్పుడు రెండు వైపులా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఆ రెండు పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్‎ను టార్గెట్ చేసి క్యాడర్‎కు గాలం వేస్తున్నాయి. నేతలను కాపాడుకోవడమే ఇప్పుడు గులాబీ పార్టీకి పెద్ద టాస్క్‎గా మారింది. పదేళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ప్రతిపక్షాలను అతలాకుతలం చేసింది. 2014లో మొదటిసారి అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీని తెలంగాణలో మటుమాయం చేసింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి కూడా మెజారిటీ ఎమ్మెల్యేలను పార్టీలో కలుపుకుంది. అంతేకాదు కమ్యూనిస్టు పార్టీల నుంచి కూడా చేరికలను ప్రోత్సహించింది. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 87 సీట్లతో తిరుగులేని మెజారిటీ వచ్చినా.. మళ్లీ కారు డోర్లు ఓపెన్ చేసి ఇతర పార్టీల కేడర్ను కిక్కిరిసిపోయేలా నింపుకుంది.

సీన్​ రివర్స్​
కాంగ్రెస్‎కి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రెండు జాతీయ పార్టీలు చేసే ఆపరేషన్ ఆకర్షణకు బిఆర్ఎస్ పార్టీ దెబ్బతింటుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు రెండు పార్టీలో చేరిపోయారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరగా.. పోతుగంటి రాములు, బీబీ పాటిల్ ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బిజెపిలో చేరారు. పార్టీ సీనియర్ లీడర్ బొంతు రామ్మోహన్, జడ్పీ చైర్మన్లు, తీగల అనిత రెడ్డి సునీత మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, డిప్యూటీ మోతే శ్రీలత, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, తీగల కృష్ణారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్‎లో చేరిన నేతల లిస్ట్ పెద్దగానే ఉంది.మరోవైపు బీజేపీ కూడా బీఆర్ఎస్‎ను భారీగానే దెబ్బతీస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వీరంతా బిజెపిలో చేరుతున్నారని ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తుంది. మరి కొంతమంది నేతలను కూడా బీజేపీ ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్​లోకి రంజిత్​
ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యేలతోపాటు మరికొందరికి పార్టీ కండువా కప్పే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సరైన అభ్యర్థులు లేక తమ నేతలను పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇస్తుందని బీఆర్ఎస్ బయటకి చెప్పుకుంటున్నా.. అంతర్గతంగా మాత్రం భవిష్యత్తులో జరగబోయే నష్టంపై ఆందోళన చెందుతుంది. ఇక పార్టీలో కొంతమంది నేతలు గత పదేళ్లుగా మనం చేసిన పని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు చేస్తున్నాయని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చినవారు అధికారం పోగానే వెళ్ళిపోతున్నారని బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.తాజాగా బీఆర్​ఎస్​కుచెందిన సిట్టింగ్​ ఎంపీ రంజిత్​రెడ్డి కాంగ్రెస్​ కండువా కప్పుకోనున్నట్లు స్పష్టమవుతున్నది. ఆయనకు చేవెళ్ల ఎంపీ టికెట్​ ఇచ్చేందుకు కాంగ్రెస్ కూడా అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఎందుకంటే ఇటీవల పార్టీలోచేరిన సునీతా మహేందర్​రెడ్డి ఈ చేవెళ్ల స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. కాంగ్రెస్​ ప్లాష్​ సర్వేలో గెలుపు అవకాశాలు లేవని తేలింది. దీంతో బలమైన అభ్యర్థి కోసం వెతుకుతున్నది. ఈ నేపథ్యంలోనే రంజిత్​రెడ్డికి గాలం వేశారు. ఆయన కూడా కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com