మీరు చికెన్ ప్రియులా.. చికెన్ ను ఇష్టంగా తింటారా?.. అయితే, మీరు కొద్దిరోజులు జాగ్రత్తగా వుండాలి. ఎందుకంటే చికెన్ ద్వారా ప్రమాదకర వైరస్ సోకుతుంది. అదే బర్డ్ ఫ్లూ. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ పంజా విసరడంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ మృత్యువాత పడడంతో ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. కొన్ని రోజులు చికెన్ తినవద్దు సూచన చేసింది. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీలకు వ్యాపించినట్లు గుర్తించారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలోని పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు హఠాత్తుగా మరణిస్తుండటంతో పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా బర్డ్ ప్లూ కేసులు బైటపడటంతో చనిపోయిన కోళ్లనుండి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేపట్టారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు తేలింది.
ఇక బర్డ్ ప్లూ సోకిన కోళ్లను తిన్నా ఈ వ్యాధి వ్యాపిస్తుందని, చికెన్ ను బాగా శుభ్రం చేసుకుని ఉడికించడం ద్వారా అందులోని వైరస్ చనిపోతుందని, అలాకాకుండా ఉడికీఉడకని చికెన్ తినడంద్వారా ఇది మనుషులకు వ్యాప్తి చెందుతుందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం బర్డ్ ప్లూ వ్యాప్తి ఎక్కువగా వ్యాప్తి నేపథ్యంలో చికెన్ తినకుండా వుండటమే మంచిదని వైద్యుల సూచనతో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.