Sunday, November 17, 2024

ముఖ్య‌మంత్రి బుల్డోజ‌ర్ ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌జ‌ల్లో భ‌యం..

నిరుపేద‌ల్లో భ‌రోసా నింపేందుకే ముసీ నిద్ర‌
కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 16: హైదరాబాద్ నగరంలో మూసీనదికి ఇరువైపులా నివాసముంటున్న ప్రజల ఇండ్లను కూల్చాలని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, బుల్డోడర్ కు అడ్డం వొచ్చినా ఇండ్లు కూల్చడం ఆగదని, పేదప్రజల ఇండ్లు కూల్చడమే త‌మ లక్ష్యం అన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ అధ్య‌క్షుడు జి.కిష‌న్ రెడ్డి అన్నారు. మూసీ నిద్ర కార్యక్రమం ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.

గత నాలుగు నెలలుగా భారతీయ జనతా పార్టీ తరఫున బాధిత ప్రజలకు భరోసా కల్పించామ‌ని,  ధర్నా చౌక్ లో ధర్నాలు చేశామ‌ని, ఈరోజు బాధిత ప్రజలతో కలిసి వాళ్ల నివాసాల్లో నిద్ర చేసే కార్యక్రమం చేస్తున్నామ‌ని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటనలతో ప్రజలు భయపడుతున్నారు.ఎప్పుడు ఏ బుల్డోజర్ వొచ్చి త‌మ ఇళ్లు కూలగొడ్తుందోనన్న భయంతో ప్రజలు అనారోగ్యాని గుర‌వుతున్నారని చెప్పారు.

ఒక జాతీయ పార్టీగా, పేద ప్రజల కోసం పని చేసే పార్టీగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందనే ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నామ‌ని, పేద ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుందని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపే ప్రయత్నం చేస్తున్నారని, గండిపేట్ నుంచి చౌటుప్పల్ వరకు మూసీలో కలుస్తున్న డ్రైనేజీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదన్నారు.

మూసీ సుందరీకరణ ఉద్దేశ్యం ఏంటీ..?? ప్రాజెక్టు ఎలా ఉండబోతుంది, నిధులు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు. లక్షా యాభై వేల కోట్లు అవసరమా..?  కేవలం పేదప్రజల ఇండ్లు కూలగొట్లే ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారు. బుల్డోజర్ కి అడ్డం వస్తే తొక్కుకుంటూ ముందుకెళ్తుందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలకు ధైర్యం చెప్పే కార్యక్రమాన్ని  నిర్వ‌హిస్తున్నామ‌ని కిష‌న్ రెడ్డి తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular