Tuesday, May 13, 2025

‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా… పోరు తెలంగాణమా’…

  • ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్
  • జీవితాంతం తన పాటలతో ప్రజలను చైతన్యపర్చింది ప్రజా గాయకుడు
  • గద్దర్‌కు నివాళ్లు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

గద్దర్ చేసిప సేవలను సిఎం రేవంత్ స్మరించుకున్నారు. ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా గద్దర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళ్లు అర్పించారు.“పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా… పోరు తెలంగాణమా” అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అని సిఎం రేవంత్ కొనియాడారు. పేద కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన గద్దర్ ఉన్నత కొలువుల వైపు దృష్టి సారించకుండా ప్రతి ఒక్కరికి కూడు, గూడు, నీడ లభించాలన్న లక్ష్యంతో జీవితాంతం తన పాటలతో ప్రజలను చైతన్యపర్చారని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ జన సమితి, తెలంగాణ జనసభతో పాటు పలు ఉద్యమ సంస్థల ఏర్పాటుతో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో అగ్రగణ్యుడు గద్దర్ అని ఆయన గుర్తు చేశారు. పాటను తూటాగా మార్చిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అని, ఆయన చేసిన సాంస్కృతిక, సాహితీ సేవకు గుర్తింపుగా నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా తమ ప్రభుత్వం మార్చిందని సిఎం రేవంత్ తెలిపారు. గద్దర్‌తో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

రేవంత్ ట్వీట్ …
“పాటకు పోరాటం నేర్పి,
తన గళాన్ని తూటాగా మార్చి
అన్యాయంపై ఎక్కుపెట్టిన తెలంగాణ సాంస్కృతిక శిఖరం” గద్దరన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను అంటూ సిఎం రేవంత్ ట్విట్టర్ వేదికగా నివాళ్లు తెలియజేశారు.

సొంత మనిషిలా భావించి…
ప్రజా యుద్ధ నౌకగా పేరుగడించిన గద్దర్ అనారోగ్యంతో మరణించినప్పుడు టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం గద్దర్ అంతిమయాత్రను అన్నీ తానై ముందుకు నడిపించారు. గద్దర్ మరణ వార్త తెలిసిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న రేవంత్ భౌతికకాయాన్ని ఎల్బీస్టేడియంకు తరలించినప్పటి నుంచి అంతిమయాత్ర, అంత్యక్రియలు ఇలా అన్నింటిలో ముందుండి నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరిగినప్పటికీ అక్కడ ఉండి అన్నీ చూసుకుంది రేవంత్ రెడ్డే.

మాట నిలబెట్టుకున్న రేవంత్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ట్యాంక్‌బండ్‌పై ప్రజాకవి గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండిఏ ఆమోదించింది. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com