పారిస్ ఒలింపిక్స్‌లో ఉత్తమ ప్రదర్శనతో పతకం సాధించిన భారత హాకీ జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. విశ్వవేదికపై మన జాతీయ క్రీడలో మన జట్టు విజయం సాధించడం గొప్ప అనుభూతిని ఇస్తోందని ఒక సందేశంలో సిఎం పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్ హాకీ ఈవెంట్‌లో కాంస్య పతకం కోసం జరిగిన పోటీలో స్పెయిన్ పై భారత్ 1-2 తేడాతో విజయం సాధించింది.