Wednesday, November 13, 2024

మూసీ ప్ర‌క్షాళ‌న చేసి తీరుతాం..

ఒకనాడు మంచి నీటిని అందించి ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చిన‌ మూసీ ఇప్పుడు మురికి కూపంగా మారి విషాన్ని చిమ్ముతోంద‌ని ,  పాలకులు పగ పట్టారా?.. దేవుడు శాపం  పెట్టాడా? అని మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు బాధపడుతున్నార‌ని, వెంట‌నే మూసీ పునరుజ్జీవింపజేయాలని కోరుతున్నార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో కులవృత్తులు చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడి చెరువుల్లో చేపలు బ‌తికే పరిస్థితి లేదు.. ఇక్కడ పండిన పంటలను తినే పరిస్థితి లేదు.. ఇక్కడ పశువుల పాలు తాగాలన్నా ఆలోచించాల్సిన దుస్థితి..

పాడిపంటలతో ఎంతో సంతోషంగా బతికిన ఇక్కడి ప్రజలు.. ఇపుడు భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి. బీఆర్ఎస్ నేతలకు దోచుకోవడమే తప్ప ప్రజలకు మేలు చేయడం తెలియదు.. అందుకే మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని అడ్డుకోవాలని చూస్తున్నారు. మూసీ ప్రక్షాళనకు అండగా ఉంటామని చెప్పిన కమ్యూనిస్టు సోదరులకు ధన్యవాదాలు.  మూసీ కాలుష్యంతో ఇక్కడి ప్రజలు అణుబాంబు కంటే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు. వరంగా ఉండాల్సిన మూసీ శాపంగా మారుతోంది.. అందుకే మూసీ ప్రక్షాళన చేయాలో లేదో ఒక్కసారి ఆలోచించండి.. మోదీ గుజరాత్ ను బాగు చేసుకోవచ్చు కానీ మేం మూసీని బాగుచేసుకోవద్దా అని ప్ర‌శ్నించారు. త‌న జన్మదినం రోజున ఇక్కడికి రావడంతో త‌న‌ జన్మ ధన్యమైంద‌ని అన్నారు. సంగెం శివయ్యను దర్శించుకుని సంకల్పం తీసుకున్నాన‌ని సీఎం  చెప్పారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular