జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశం నిర్వహించారు. ఎంపి అభ్యర్థి సురేష్ షెట్కర్ గెలుపు వ్యుహాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆయన గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని సిఎం వారికి సూచించారు. ఈ సమావేశంలో భాగంగా మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపి అభ్యర్థి సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.