- అర్చకులు రంగరాజన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్
- నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం..
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. రంగరాజన్ ను సీఎం పరామర్శించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్చకులు రంగరాజన్ కు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. తెలంగాణలో ప్రముఖ ఆలయమైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, టెంపుల్ ప్రొటెక్షన్ మూమెంట్ ఫౌండర్ రంగరాజన్ ఆయన తండ్రి సౌందర్య రాజన్ లపై శుక్రవారం దాడి జరిగిన విషయం తెలిసిందే.
ఆలయ ప్రాంగణంలోని రంగరాజన్ ఇంట్లోకి రాత్రివేళ చొరబడిన దుండగులు.. ఆయనపై, వృద్ధులైన ఆయన తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసి, గాయపరిచారు. ఈ ఘటనకు సంబంధించి.. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సైతం బయటకు వొచ్చింది. ఘటన పట్ల అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.