ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కులగణన కార్యక్రమం ద్వారా దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
ఆకాశం -భూమి ఏకమై, అవకాశాల్లో సమానత్వం, అణగారిన వర్గాల సామాజిక న్యాయం కోసం చేస్తున్న యజ్ఞం ఇది అని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అలాగే నేడు తెలంగాణ గడ్డపై మొదలై రేపు రాహుల్ సారథ్యంలో దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసం ఇది అని సిఎం రేవంత్ వ్యాఖ్యానించారు.