Saturday, December 28, 2024

Chief Secretary Vs IAS సిఎస్‌కు వ్యతిరేకంగా సమావేశం

రెండురోజుల క్రితం ఓ సీనియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో ఐదుగురు ఐఏఎస్‌ల భేటీ

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సిఎస్) వర్సెస్ కొందరు ఐఏఎస్‌ల మధ్య వార్ నడుస్తోంది. సిఎస్‌ల వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావిస్తున్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, కొందరు ఐఏఎస్ అధికారులతో రెండు రోజుల క్రితం రహస్యంగా సమావేశమయినట్టుగా తెలిసింది. తమ శాఖలకు సంబంధించి సిఎస్ ఇబ్బందులు పెడుతున్నారని సిఎం వద్ద తమను అకారణంగా ఇరికిస్తున్నారని వారు భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో మరో ఐదుగురు ఐఏఎస్‌లు సమావేశమై సిఎస్ వల్ల తమకు కలుగుతున్న ఇబ్బందుల గురించి చర్చించుకున్నట్టుగా తెలిసింది.

కొందరు ఐఏఎస్‌లు తమకు అప్పగించిన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడం లేదని సిఎం క్లాస్ తీసుకోవడం వెనుక కూడా సిఎస్ ఉందని ఈ ఐఏఎస్‌లంతా భావిస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఈ సమావేశానికి అధ్యక్షతన వహించిన ఈ సీనియర్ ఐఏఎస్‌కు చాలారోజులుగా సిఎస్‌తో పొసగడం లేదని, కనీసం ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు కూడా సిఎస్‌కు ఈ సీనియర్ ఐఏఎస్ విష్ చేయరన్న చర్చ కూడా ఐఏఎస్‌ల్లో జరుగుతోంది. ఇలా సిఎస్‌కు వ్యతిరేకంగా సీనియర్, జూనియర్ ఐఏఎస్‌లు సమావేశం కావడంపై సచివాలయం ఉద్యోగులు, అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com