Thursday, May 8, 2025

ముఖ్యమంత్రికి రాఖీ కట్టిన చిన్నారులు…

‌వినికిడి సమస్యతో బాధపడుతూ ప్రభుత్వ సహాయంతో శస్త్రచికిత్స చేయించుకున్న పలువురు చిన్నారులు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి సోమవారం రాఖీలు కట్టి తమ అభిమానం చాటుకున్నారు. వినికిడి సమస్య ఉన్న అయిదేళ్లలోపు పిల్లలకు సర్జరీలు చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. కాగా ముఖ్యమంత్రిగా రేవంత్‌ ‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారుల వైద్యానికి అవసరమైన సహాయాన్ని వేగంగా అందిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌ ‌కోటిలోని ఈఎన్‌టీ హాస్పిటల్‌లో కోహ్లియర్‌ ఇం‌ప్లాంట్‌ ‌సర్జరీలు ఇటీవల పెద్ద సంఖ్యలో జరగుతున్నాయి.

ఖరీదైన వినికిడి యంత్రాలు, సర్జరీలు చేయించుకున్నవారికి ఎల్‌వోసీ, సీఎంఆర్‌ఎఫ్‌ ‌ద్వారా ప్రభుత్వం అండగా నిలిస్తుంది. చికిత్సల అనంతరం ఉచితంగా వినికిడి యంత్రాలతో పాటు ఏడాది పాటు ఏవీటీఋఅడిషన్‌ ‌వర్బల్‌ ‌థెరపీ) అందిస్తారు. ఇటీవల ఈ సర్జరీలు చేయించుకున్న పలువురు చిన్నారులు ఇఎన్‌టి హస్పిటల్‌  ‌సూపరింటెండెంట్‌ ఆనంద్‌ ఆచార్య, వైద్యురాలు డీకే వీణ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయానికి వొచ్చి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ పిల్లలకు శస్త్రచికిత్సలు చేయించినందుకు వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com