Thursday, December 26, 2024

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ నుంచి సింహంలాగా పనిచేస్తారు

  • క్రోధి నామసంవత్సరం లో కూడా అంతా మంచే జరుగుతుంది
  • రాహుల్ గాంధీకి రాజయోగం ఉంటుంది
  • కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం వస్తుంది
  • గాంధీభవన్‌లో జరిగిన పంచాంగ పఠనంలో….

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ నుంచి సింహంలాగా పనిచేస్తారని చిలుకూరి శ్రీనివాస మూర్తి అన్నారు. క్రోధి నామసంవత్సరం లో కూడా అంతా మంచి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా రాజయోగం ఉంటుందని అయన తెలిపారు. మంగళవారం గాంధీభవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిలుకూరి శ్రీనివాస మూర్తి పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా చిలుకూరి శ్రీనివాస మూర్తి పంచాంగ పఠనంలో భాగంగా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం వస్తుందని తెలిపారు. రాష్ట్రాల్లో ప్రతిపక్షం మరింత వీక్ అవుతుందన్నారు. అధికార పార్టీ కొత్త చట్టాలను తెస్తుందని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టులో అన్యుహ మార్పులు సంభవిస్తాయన్నారు. కొందరు సీనియర్ నేతలు రాజకీయాలకు దూరమవుతారని, ప్రధానమంత్రి పదవిలో మార్పులు సంభవిస్తాయన్నారు. రాజకీయ నేతలు కూడా శిక్షార్హులు అవుతారని చిలుకూరి శ్రీనివాస మూర్తి తెలిపారు.

వచ్చే మూడు నెలల్లో భూ కంపాలు, అగ్ని ప్రమాదాలు
వచ్చే మూడు నెలల్లో భూకంపాలు, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. చైనా, పాకిస్తాన్‌ల మీద మనం పైచేయి సాధిస్తామన్నారు. పత్రికా రంగం అధిపతి ఒకరు చనిపోతారని, క్రీడా రంగంలో ఒక ప్రముఖ క్రీడాకారుడు చనిపోతారని ఆయన తెలిపారు. కేంద్రం, రాష్ట్ర సిలబస్‌లో చాలా మార్పులు జరుగుతాయని, సిమెంట్, ఇటుక వాడుకలు తగ్గుతాయని, ప్రతిపక్షం చాలా బలహీన పడుతుందన్నారు. విదేశీ మత్తు పదార్థాలను అరికట్టడం చాలా కష్టం అవుతుందని, ప్యాన్ ఇండియా సినిమాలు తీసే నిర్మాతలు చాలా నష్టపోతారన్నారు. ఆర్థిక పరమైన సినిమాలు ఎక్కువగా వస్తాయని, సినిమా, రాజకీయ ప్రముఖుల్లో కొందరు చనిపోతారన్నారు.

Also Read: నేను బాధితురాలిని నాకెలాంటి సంబంధం లేదు

సినీ రంగంలో భార్యాభర్తల మధ్య విడాకుల సంఖ్య ఎక్కువ అవుతుందని, కరోనా సమసి పోలేదని, కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకుల అక్రమ సంబంధాలు బయట పడతాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వంలో చేసిన భూ స్కాంలు, అవినీతి బయట పడుతుందని, స్కాంలలో కొందరు నాయకులు అరెస్ట్ అవుతారని తెలిపారు. దేవాలయాల అభివృద్ధి జరుగుతుందన్నారు. దేశ రాజకీయాల్లో చాలా మార్పులు జరుగుతాయని, కొంత మంది ప్రముఖ నేతలు కనుమరుగువుతారని ఆయన పేర్కొన్నారు. 2027 నుంచి 2030 వరకు మన దేశం అగ్ర స్థానంలో ఉంటుందని, ఒక యోగి మన దేశాన్ని పాలిస్తారని, వెండి, బంగారం,ఇత్తడి ధరలు మరింత పెరుగుతాయన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com