Sunday, September 29, 2024

Rajya Sabha post Chiru?మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ పదవి?

స్పంచిందిన చిరంజీవి కుమార్తె సుష్మిత

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడంతో త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి కి రాజ్యసభ పదవి దక్కబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబందించి చిరంజీవికి ప్రధాని మోదీ నుంచి హామి లభించిందన్న చర్చ జరుగుతోంది.

దీనిపై చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత స్పందించారు. ఆమె నిర్మాణ సారధ్యంలో వస్తున్న పరువు వెబ్‌ సిరీస్‌ ప్రచారంలో భాగంగా మాట్లాడిన సుష్మిత.. చిరంజీవికి రాజ్యసభ అంశం చర్చకు రాగా.. తన పరిధిలో లేని అంశాల గురించి అడుగుతున్నారని అన్నారు. సదరు రూమర్స్‌ తన దృష్టికి కూడా వచ్చాయని, అయితే ప్రస్తుతానికి తమ ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌ మూడ్‌లో ఉందని కామెంట్ చేశారు.

చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీని స్ఖాపించి, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా, రాజ్య సభ సభ్యులుగా పనిచేశారు. ఎన్నికలకు ముందు కూడా చిరంజీవికి రాజ్యసభ పదవి దక్కబోతోందన్న ప్రచారం జరగ్గా.. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించడంతో చిరంజీవి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. స్వయంగా ప్రధాని మోదీ చిరుకి రాజ్యసభ పదని ఆఫర్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందన్నది ముందు ముందు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular