కొన్ని దశాబ్ధాలుగా టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు చిరంజీవి. పట్టుదల, కృషి, క్రమశిక్షణ ఉంటే ఎవరైనా సరే తారా స్థాయికి వెళ్లొచ్చనే విషయాన్ని చిరంజీవి ఎప్పుడో ప్రూవ్ చేశాడు. ఆయన్ను చూసి ఎంతోమంది నటీనటులు సినీ పరిశ్రమకి వచ్చిన విషయం పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడమే తన ధ్యేయంగా మెగాస్టార్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అప్పట్లోనే తెలుగు సినిమా మార్కెట్ ను పెంచాడు మెగాస్టార్. రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న మొదటి ఇండియన్ హీరోగా చిరంజీవి రికార్డు కూడా సృష్టించాడు. అలాంటి చిరంజీవి తన మనసులోని కోరికను ఓ సందర్భంలో బయట పెట్టాడు. చిరంజీవికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి అనే విషయం తెలిసిందే. తన ఇద్దరు కూతుళ్లకు చెరో ఇద్దరు కూతుళ్లు పుట్టారు. కొడుకు రామ్ చరణ్ కు కూడా కూతురే. దీంతో చిరంజీవి ఇంట్లో మొత్తం అమ్మాయిలే ఉన్నారు. చరణ్ తర్వాత తన కుటుంబంలో మరో వారసుడు లేడు. మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడూ ఈ విషయం గురించే మాట్లాడుతూ ఉంటారు. చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ ఈ విషయంలో ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ మొదటిసారి చిరంజీవి తనకు మనవడు ఉంటే బాగుండనిపిస్తుందని, తన ఇంట్లో మొత్తం అమ్మాయిలే ఉండటం వల్ల ఇల్లు లేడీస్ వార్డెన్ రూమ్ లా మారిపోయిందని, ఒక మగ పిల్లాడుంటే బావుంటుందనిపిస్తుందని అంటూ, చరణ్ ఈసారైనా ఓ మగ పిల్లాడిని కనరా అని అన్నాడు. క్లీంకారను చరణ్ చాలా ముద్దు చేస్తాడని, అది చూసి మళ్లీ కూడా చరణ్ ఇంకో అమ్మాయినే కంటాడేమోనని భయంగా ఉందని చిరంజీవి సరదాగా అన్నాడు.