Friday, January 10, 2025

చిరు నెక్స్‌ట్‌ డైరెక్టర్‌ హరీషా.. కాదా?

దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా పవన్‌కళ్యాణ్‌ డేట్స్‌ కష్టంగా మారాయి. దాంతో రవితేజతో మిస్టర్ బచ్చన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ రీమేక్ గా రూపొందుతున్న ఈ హీస్ట్ థ్రిల్లర్ ని వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదింకా పూర్తి కాకుండానే హరీష్ శంకర్ మరో మెగా జాక్ పాట్ కొట్టేసినట్టు ఇండస్ట్రీ టాక్. చిరంజీవి హీరోగా సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ దక్కిందని సమాచారం.

భోళా శంకర్ టైంలో చిరంజీవి దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమాకు ఓకే చెప్పారు. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ తో స్క్రిప్ట్ రాయించారు. బ్రో డాడీ రీమేకనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ తర్వాత మనసు మార్చుకుని దాన్ని పక్కన పెట్టేశారు. తక్కువ బడ్జెట్ కావడంతో ముందు సుస్మిత సింగల్ ప్రొడ్యూసర్ కార్డుతో తీయాలని ప్లాన్. ప్రస్తుతం ఆ సినిమా ప్లాన్‌ మొత్తం మారిపోయింది. హరీష్ శంకర్ సీన్‌లోకి ఎంటర్‌ అవ్వగానే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీని జాయింట్ పార్ట్ నర్ గా చేర్చినట్టు తెలిసింది. మిస్టర్ బచ్చన్ నిర్మాతలు వాళ్లే కావడంతో లింకులు ముడిపడి ఇలా కాంబో సెట్ అయ్యింది.

ఇక ఈ విషయం పై అధికారిక ప్రకటన అయితే ఇంకా లేదు. చిరు క్యాస్టూమ్ డిజైనర్ గా సుస్మిత ఖైదీ నెంబర్ 150 నుంచి ప్రతి సినిమాకు ఆ బాధ్యతను తానే నిర్వహిస్తున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై శ్రీదేవి శోభన్ బాబు తీసినప్పటికీ అది మరీ దారుణంగా డిజాస్టర్ కావడం ఊహించలేదు. నాన్నతో తీస్తే ఒకేసారి మార్కెట్, బ్రాండ్ రెండూ పెరుగుతాయి అని భావించి తీయాలనుకుంటుంది. మరి ప్రసన్న రాసిచ్చిన స్క్రిప్ట్ కి దర్శకుడు ఎవరు హరీష్‌ ఆ లేక వేరేనా అన్నది తెలియాల్సి ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com