Sunday, April 6, 2025

క్రిస్మస్‌ పండుగ అంటే నాకు చాలా ఇష్టం-ఉదయ్‌నిధి

ఉదయ్‌నిధి స్టాలిన్‌ పరిచయం అక్కర్లేని పేరు. తమిళనాడు డిప్యూటీ సీఎం, ఎన్నో చిత్రాల్లో నటించిన హీరో. సంచలన వ్యాఖ్యలతో ఈయన మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రజలు తనను క్రైస్తవుడిగా భావిస్తే తాను క్రైస్తవుడినని, ముస్లింగా భావిస్తే ముస్లింనని, హిందువుగా భావిస్తే హిందువునని ఆయన చెప్పారు. అన్ని మతాలు తనకు సమ్మతమేనని అన్నారు. క్రిస్మస్ అంటే తనకు చాలా ఇష్టమని… క్రైస్తవుడినని చెప్పుకునేందుకు తాను ఎంతగానో గర్వపడుతున్నానని చెప్పారు. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని తానొక క్రైస్తవుడినని చెపితే… తమ రాజకీయ ప్రత్యర్థులకు కడుపుమంటగా మారిందని విమర్శించారు.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఉదయనిధి మండిపడ్డారు. ఆ న్యాయమూర్తిని తొలగించే బిల్లుకు డీఎంకే, ఇండియా కూటమి ఎంపీలు మద్దతు ప్రకటిస్తే.. అన్నాడీఎంకే మద్దతు ప్రకటించకుండా మౌనంగా ఉందని విమర్శించారు. క్రైస్తవులు, ముస్లింలు ఎప్పుడూ డీఎంకేకు మద్దతుగా ఉంటారని చెప్పారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అన్ని మతాలు సమానమేనని ఎటువంటి భేషజాలు లేవని తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com