త్రిశూల శక్తితో ఇండియన్ నేవీ పోస్ట్
సముద్రంపై తమ బలాన్ని, పరాక్రమాన్ని చూపుతూ ఇండియన్ నేవీ ఎక్స్ (X)లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో INS యుద్ధనౌక, జలాంతర్గామి, హెలికాప్టర్ మూడు ఉన్నాయి. ఈ మూడీటిని కలిపి ఇండియన్ నేవీ శక్తి త్రిశూలంగా అభివర్ణిస్తారు. ఈ టైంలో నేవీ పోస్ట్ చర్చనీయాంశమై వైరల్ అవుతుంది. దీంతో యుద్ధానికి సంసిద్ధం అన్నట్లు ఇండియన్ నేవీ సంకేతాలు తెలిపింది. సముద్రంపై తమ బలాన్ని, పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ భారత నావికాదళం శనివారం ఓ సంచలన పోస్ట్ చేసింది. అరేబియా సముద్రంలో మోహరించిన శక్తివంతమైన యుద్ధనౌక ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఉపరితల యుద్ధనౌక, జలాంతర్గామి, హెలికాప్టర్ మూడు ఉన్నాయి. ఈ మూడీటిని కలిపి ఇండియన్ నేవీ శక్తి త్రిశూలంగా అభివర్ణిస్తారు. ఇండియన్ నేవీ చేసిన పోస్ట్‌లో సముద్రం నుంచి ఆకాశానికి.. ఎనీ టైం, ఎనీ వేర్, ఎలాగైనా అని హ్యాష్ ట్యాగ్ చేసింది.
తమ బలాన్ని.. శక్తిని సోషల్ మీడియా ఎక్స్ (X) లోని ఇండియన్ నేవీ ఈ పోస్ట్ పెట్టింది. ఇందులో స్కార్పీన్-క్లాస్ జలాంతర్గామి అయిన డిస్ట్రాయర్, INS కోల్‌కతా, ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ALH) ఉన్నాయి. ఇండియన్ నేవీ పవర్ కింద.. మరియు అలల మీద అని క్యాప్షన్‌తో ఈ పోస్ట్ ఉంది. ఇది పాకిస్తాన్‌తో తీవ్ర ఉద్రిక్తత మధ్య త్వరగా వైరల్ అయింది.