Monday, March 31, 2025

సినీ నటి పుష్పలత కన్నుమూత

అలనాటి నటి పుష్పలత కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. 87 ఏళ్ల పుష్పలత నిన్న రాత్రి చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘చెరపకురా చెడేవు’ చిత్రం ద్వారా ఆమె తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 100కు పైగా సినిమాల్లో ఆమె నటించారు. ప్రముఖ నటులు ఎంజీఆర్, శివాజీ గణేషన్, జెమినీ గణేషన్, జైశంకర్ ల సినిమాల్లో నటించారు. తెలుగులో ఎన్నో చిత్రాలలో ఆమె నటించి ప్రేక్షకులను అలరించారు. 1963లో ‘నానుమ్ ఒరు పెన్’ చిత్రంలో ఏవీఎం రాజన్ సినిమాలో ఆమె నటించారు. ఆ సందర్భంగా ప్రేమలో పడిన వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరిలో ఒక కూతురు హీరోయిన్ గా రాణించింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com