- వరంగల్ సాయిశివానికి 20వ ర్యాంక్
- పట్టువదలని విక్రమార్కుడు సాయిచైతన్య
జీవితంలో సక్సెస్ అనేది ఊహించినంత ఈజీగా రాదు. కానీ ఎంచుకున్న లక్ష్యంపైనే గురిపెట్టి చావో రేవో తేల్చుకునేలా పోరాటం చేసేవారినే విజయం వరిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయి చైతన్యది కూడా ఇదే స్టోరీ. తండ్రి కానిస్టేబుల్. తల్లి టీచర్. తల్లిదండ్రుల నుంచి వొచ్చిన ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సాయి చైతన్య. సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 68వ ర్యాంక్ సాధించిన సాయి చైతన్య ఆదర్శంగా నిలిచాడు. సివిల్స్ లో 68వ ర్యాంకు రావడం నా ఆరేళ్ల కష్టానికి దక్కిన ఫలితం. ఎంతో కష్టపడి చదివాను.. ఐదుసార్లు విఫలమయ్యాను. ఎక్కడా నిరుత్సాహపడలేదు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల ఆశీస్సులతో ఈ విజయం సాధ్యమైంది. అదిలాబాద్ గిరిజన ప్రాంతం నుంచి వొచ్చిన నాకు క్లిష్ట పరిస్థితులు తెలుసు. మాది ఉట్నూర్ దగ్గర చిన్న ఏజెన్సీ ప్రాంతం. ఫెయిల్ అయ్యానని నిరుత్సాహపడకుండా కృషి చేశా. విజయం సాధించా. 68 ర్యాంక్ వొస్తుందని నేను అనుకోలేదు. రిజల్ట్ రావడం చాలా హ్యపీగా ఉంది. పేదల కోసం గవర్నెన్స్ లో భాగం అవుతానని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు చెందిన హెడ్ కానిస్టేబుల్ జాదవ్ గోవింద్ కొడుకు చైతన్య జాదవ్ సివిల్స్ లో 68 ర్యాంక్ సాధించాడు.
దీంతో ఊట్నూరులో ఆనందోత్సవాలు మొదలయ్యాయి. యూపీఎస్సీ ఫలితాల్లో వరంగల్ కు చెందిన ఇట్టబోయిన సాయిశివాణి జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ తో సత్తా చాటింది. వరంగల్ నగరంలోని ఇట్టబోయిన రాజ్‌కుమార్, – రజితల ప్రథమ పుత్రిక ఇట్టబోయిన సాయిశివాణి జాతీయస్థాయిలో టాప్ 20 ర్యాంకు సాధించి గర్వకారణంగా నిలిచింది. జాతీయ స్థాయి ర్యాంక్ సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ల శ్రమకు తగిన ఫలితం దక్కిందని, తమ కూతురు కలెక్టర్ కాబోతుందంటూ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.