Friday, December 27, 2024

ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మైన సంస్కరణలు

#రైతాంగానికి ప్రోత్సాహకాలు అందించేందుకే సన్నాలకు బోనస్
#ఇప్పటి వరకు 13.13 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు
#కొనుగోలు చేసిన ధాన్యం ఖరీదు 3,045.76 కోట్లు
#సన్నాలకు 9.21 కోట్ల బోనస్ చెల్లింపు
#ఈ నెల 23 నాటికి 90 శాతం బోనస్ చెల్లింపులు
#సాంకేతిక కారణాలతో చెల్లింపులలో జాప్యం
#సంవత్సరాంతంలో పి.డి.ఎస్ బియ్యం నిలువరింపు
#జనవరి నుండి సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వ మార్గదర్శకాలు
#2.81 లక్షల మందికి కలగ నున్న ప్రయోజనం
#ధాన్యం కొనుగోలులో సంస్కరణలు లొసుగులను అడ్డుకునేందుకే
#ధాన్యం కొనుగోలులో దుర్వినియోగం కట్టడికే సంస్కరణలు
#పాత పాలసిలో లోపాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి
#2014 నుండి 2023 వరకు కార్పొరేషన్ పై 58,623 కోట్ల భారం
#సంవత్సరంలోగా 11,608 కోట్ల రికవరీ
# బ్యాన్క్ గ్యారెంటీ పై అపోహలు వలదు
#సి.యం.ఆర్ బియ్యం ప్రభుత్వానికి చేరంగానే బ్యాంక్ గ్యారెంటీ వాపస్
#బ్యాంక్ గ్యారెంటీతో మరోదానికి ముడి పెట్టె ప్రసక్తి లేదు.

#లీజ్ పేరుతో మోసాలను అరి కట్టేందుకే నో డ్యూస్ సర్టిఫికెట్లు
#ప్రభుత్వ పరంగా ధాన్యం కేటాయింపులు ఉండవు
#సామర్ధ్యంతో పాటు మంచి నడవడిక ఉన్న వారికే ప్రాధాన్యం
#ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డ వారికి కేటాయింపులు ఉండవు
#అవక తవకలకు పాల్పడ్డ మిల్లర్లు 362 మంది
#అవకతవకలకు పాల్పడని రైస్ మిల్లర్లకు 10%బ్యాంక్ గ్యారెంటీ
#అవకతవ్వకలకు పాల్పడి తిరిగి అసలు పెనాల్టీ చెల్లించిన వారికి 20%బి.జి
#డిఫాల్టర్లు అయి ఉండి అసలు కట్టి పెనాల్టీ చెల్లించని వారికి 25% బ్యాంక్ గ్యారెంటీ
#ధాన్యం కొనుగోలులో పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం
#సన్నాలు,దొడ్డు రకాలు కలవకుండా ఉండేందుకు ప్రత్యేక కమిటీలు
#ఎప్పటికప్పుడు తనిఖీలకు ఆదేశాలు
#ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు రైతాంగానికి ప్రయోజనం కలిగిస్తాయి
-పౌర సరఫరాల ముఖ్య కార్యదర్శి డి.ఎస్.చౌహన్

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చిందని రాష్ట్ర పౌర సరఫరాల ముఖ్య కార్యదర్శి మరియు కమిషనర్ డి.ఎస్.చౌహన్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు రైతాంగానికి ప్రయోజనం కలిగించిందుకే నని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఏర్పడ్డ మంత్రివర్గ ఉపసంఘం పలుమార్లు లోతుగా అధ్యయనం చేసి సంస్కరణలు తీసుకొచ్చామన్నారు.

పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు చేసిన సిఫారసుల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంస్కరణలకు అంకురార్పణ చుట్టారన్నారు. సోమవారం సాయంత్రం ఎర్రమంజిల్ కాలనీ లోని పౌర సరఫరాల శాఖా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పౌర సరఫరాల డైరెక్టర్ ప్రసాద్ తో కలిసి ఆయన మాట్లాడారు.

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. అందుకు గాను 3045.76 కోట్లు అయినట్లు ఆయన పేర్కొన్నారు.ఇప్పటి వరకు రైతులకు 1560.70 కోట్లు చెల్లించామన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ధాన్యం దిగుబడి రావడంతో ముందెన్నడూ లేని విదంగా రాష్ట్ర వ్యాప్తంగా 8066 కొనుగోలు కేంద్రాలు ప్రారంబించినట్లు ఆయన తెలిపారు.

ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 13.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 10.11 మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకం కాగా 3.02 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు సన్నాలకు చెల్లించిన బోనస్ 9.21 కోట్లు అని ఆయన వివరించారు.ఈ నెల 23 నాటికి సన్నాలకు అందించే బోనస్ చెల్లిపులు 90% ఉంటుందన్నారు.సాంకేతిక కారణాలతోటే కొంత జాప్యం జరిగిందని ఇకపై కొనుగోళ్లు, చెల్లింపులు వేగవంతం అవుతాయాన్నారు.సంవత్సరాంతానికి పి.డి.ఎస్ బియ్యాన్ని పూర్తి స్థాయిలో నిలువరిస్తామన్నారు.

జనవరి నుండి చౌకధరల దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీకి మార్గదర్శకాలు వచ్చయాన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 2.81 లక్షల లబ్ధిదారులకు ప్రయోజనం కలగ బోతుందన్నారు. ధాన్యం కొనుగోలులో లొసుగులను నివారించేందుకే ఈ సంస్కరణలు అని ఆయన చెప్పారు. ధాన్యం కొనుగోలులో దుర్వినియోగంతో పాటు ప్రభుత్వానికి నష్టం వచ్చే చర్యలను గుర్తించి సమూలంగా ప్రభుత్వం సంస్కరించినట్లు ఆయన అన్నారు.

పాత పాలసిలో ఉన్న లొసుగులతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందన్నారు.ప్రభుత్వ ఆదాయానికి గండి పడడం అంటే ప్రజా సొమ్ము దుర్వినియోగం అయినట్లే నని ఆయన వివరించారు. 2014 నుండి 2023 వరకు కార్పొరేషన్ పై 58,623 కోట్ల భారం పడిందన్నారు.సంవత్సరానికి ఐదు కోట్లకు పైగా భారం పెరుగుతూ వచ్చిందని ఆయన చెప్పారు. కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు కేవలం సంవత్సరం లోపే 11,608.40 కోట్లు చెల్లించి ఆ భారాన్ని 47,014.68 కోట్లకు కుదించినట్లు ఆయన తెలిపారు

బ్యాంక్ గ్యారెంటీలపై ఎటువంటి అపోహలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు.సి.యం.ఆర్ బియ్యం ప్రభుత్వానికి చేరంగానే బ్యాంక్ గ్యారెంటీ వాపసు ఇవ్వడం జరుగుతుందన్నారు.బ్యాంక్ గ్యారెంటీని మరోదానితో ముడి పెట్టె సమస్య లేదని ఆయన సుస్పష్టంగా వివరించారు. లీజ్ పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకే నో-డ్యూస్ సర్టిఫికెట్ లు తప్పనిసరి చేశామన్నారు.ప్రభుత్వ పరంగా ధాన్యం కేటాయింపులకు ఆస్కారం ఉండదన్నారు.సామర్ధ్యం తో పాటు మంచి నడవడిక ఉన్న మిల్లులకు సహజంగానే ధాన్యం కేటాయిస్తారని ఇక్కడ పైరవిలకు చోటు లేదన్నారు

అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ధాన్యం ఇచ్చే ప్రసక్తి లేదని చౌహన్ తేల్చిచెప్పారు. ఇప్పటి వరకు 362 మంది మిల్లర్లు అవక తవకలకు పాల్పడ్డారన్నారు. ఎటువంటి అవకతవకలకు పాల్పడని రైస్ మిల్లలుకు 10% బ్యాంక్ గ్యారెంటీ గా నిర్ణయం తీసుకోగా అవకతవకలకు పాల్పడి అసలు చెల్లించి పెనాల్టీ చెల్లించిన వారికి 20% గా ,అసలు చెల్లించి పెనాల్టీ చెల్లించని మిల్లులకు 25% గా బ్యాంక్ గ్యారెంటీ నిర్ణయించమన్నారు. ధాన్యం కొనుగోళ్లల పర్యవేక్షణకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ప్రత్యేక అధికారులను నియమించిందన్నారు. సన్నాలు,దొడ్డు రకాలు కలవకుండా ఉండేందుకు ప్రత్యేక కమిటీలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నాయన్నారు. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆయా కమిటీలు తనిఖీలు నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని డి.ఎస్.చౌహన్ తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com