Saturday, December 28, 2024

రాజన్న సిరిసిల్లపై సిఎం వరాలజల్లు

మొదటి సంవత్సరంలోనే సుమారుగా 694. 50 కోట్ల కేటాయింపు
రాజన్న సిరిసిల్లపై సిఎం వరాలజల్లు కురిపించారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే సుమారుగా ఈ జిల్లాకు 694. 50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. దీంతోపాటు వేములవాడలో సిఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించింది. అందులో ముఖ్యంగా స్థానిక రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనుంది. ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ.76 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్నదాన సత్రం నిర్మాణ పనులకు రూ.35.25 కోట్లను, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ఉన్న రోడ్లను వెడల్పు చేసేందు రూ.47.85 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

ఈ నిధులతో రోడ్డు విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను చేపట్టనుంది. రూ.166 కోట్లతో చేపట్టే వైద్యకళాశాల, హాస్టల్‌బ్లాక్ నిర్మాణ పనుల కోసం నిధులను ప్రభుత్వం కేటాయించింది. దీంతోపాటు నూలుడిపో నిర్మాణ పనులకు రూ.52 కోట్లు మంజూరు చేసింది. 4,696 మంది మిడ్‌మానేరు రిజర్వాయర్ నిర్వాసితుల కోసం నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కోసం రూ.235 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మూలవాగులో ఉన్న బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు పైప్లైన్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.3.8 కోట్లు కేటాయించి పనులకు ఆమోదం తెలిపింది. ఇక ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.26 కోట్లతో ఎస్పీ భవనం నిర్మాణం, రూ.45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, రూ.4 కోట్ల 80 లక్షలతో వర్కింగ్ ఉమెన్ హస్టల్ నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి. అంతేకాకుండా వేములవాడకు చెందిన 17 కుటుంబాలకు చెందిన వ్యక్తులు గల్ఫ్ దేశాలలో మరణించగా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా 631 శివశక్తి మహిళ సంఘాలకు రూ.102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను సైతం పంపిణీ చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com