అమరావతి :- తెలంగాణ టీడీపీ నేత కూన వెంకటేష్ గౌడ్ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులుగా పార్టీకి వెంకటేష్ గౌడ్ సేవలందించారని కొనియాడారు. సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసిన వెంకటేష్ గౌడ్ మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.