అమరావతి డ్రోన్ సమ్మిట్ నిర్వహించిన అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అమరావతి డ్రోన్ సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించిన అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర పెట్టుబుడులు, మౌలికసదుపాయాల కల్పన శాఖ కార్యదర్శి, ఎస్. సురేష్ కుమార్, ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె. దినేష్ కుమార్ లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ఆయనకు డ్రోన్ జ్ఞాపికను బహుకరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతి డ్రోన్ షోను అద్భుతంగా నిర్వహించారని అధికారులను అభినందించారు. ముఖ్యంగా 22వ తేదీ కృష్ణానది తీరాన 5,500లకుపైగా డ్రోన్లతో నిర్వహించిన మెగా డ్రోన్ షో అద్భుతంగా ఉందని ప్రశంసించారు. డ్రోన్ సమ్మిట్ నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అంతరాయలు లేకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, ఇదే స్ఫూర్తిని ఇకముందు కూడా ఇలాగే కొనసాగించాలని సూచించారు. గుడ్.. బాగా చేశారు అంటూ అధికారులను సీఎం అభినందించారు.