Wednesday, December 25, 2024

‘గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియా’ సీఎం చంద్రబాబు

సాంకేతికపరమైన విప్లవానికి నాంది పలికిన నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సాంకేతికపరమైన విప్లవానికి నాంది పలికి, నిరంతరం సంస్కరణల అభిలాషి అయిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ది గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో నిర్వహించిన రాష్ట్రంలోని పలు విద్యుత్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు తనను ఇంఛార్జ్ మంత్రిగా నియమించిన తర్వాత ఇది మొదటి అభివృద్ధి కార్యక్రమమన్నారు. అందునా అభివృద్ధికి చిరునామాగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం తనకు గర్వకారణంగా ఉందన్నారు.

విద్యుత్ సంస్కరణల విషయంలో చంద్రబాబుది మొదటి నుంచి ప్రత్యేకమైన ముద్ర అని మంత్రి అన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రులు రాజకీయపరమైన ఆలోచనలే చేస్తారు..కానీ చంద్రబాబు రాజకీయాలకే పరిమితం కాకుండా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిపథంలో నడిపాలనే ఆలోచన చేసి దానికి అవసరమైనటువంటి సాంకేతికతను జోడించి, విప్లవం సృష్టించి తద్వారా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు చంద్రబాబు నాయుడు అని అభివర్ణించారు.

అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తే అది గృహావసరాలకు, పారిశ్రామికాభివృద్ధికి, వ్యవసాయాభివృద్ధికి ఉపయోగపడుతుందనే ఆలోచన చేశారు మన సీఎం.. ఈ విధమైన సంస్కరణలతో ఈ ప్రాంతాన్ని మాత్రమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తొలి నుంచి ప్రత్యేకమైన కృషి చేస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు అని మంత్రి అన్నారు..

రాజధాని ప్రాంతంలో ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం, ఇది ఇక్కడికే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం మీద 18 ప్రాజెక్టులు.. వీటిలో 5 ప్రారంభోత్సవాలు, మిగతా 13 శంకుస్థాపనలు.. వెరసి రూ.5,407 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రగతి విషయంలో వస్తున్నటువంటి సరికొత్త మలుపు అని మనవి చేస్తున్నానని వెల్లడించారు.

అధికారంలోకి వచ్చి 4 నెలలు మాత్రమే అయ్యింది.. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోతే సాహసోపేతమైన ముఖ్యమంత్రి కనుక, అదేవిధంగా వారికి సహకరించేటటువంటి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి అద్భుతంగా ఇవాళ పెన్షన్లు, రైతులకు బకాయిలు, నిరుద్యోగులు కలలుకంటున్న మెగా డీఎస్సీ.. వీటన్నింటినీ వేగవంతంగా ముందుకు తీసుకొచ్చి తద్వారా నేడు పేద వర్గాల మనస్సుల్లో, ముఖాల్లో చిరునవ్వు తీసుకొచ్చారన్నారు..

చంద్రబాబు మాటలు, చూపించే దారి మాకందరికీ మార్గదర్శకం అని మంత్రి దుర్గేష్ అన్నారు.. రాజధాని అమరావతిని సంపూర్ణంగా, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా, అత్యుత్తమ రాజధానిగా తయారు చేయడానికి ఆయన ఎంతో తపన పడుతున్నారన్నారు. 2014 నుంచి 2019 వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని 2019లో ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని విషయంలో ప్రతిష్ఠంభన ఏర్పడిందని వివరించారు.. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఇది భగవంతుడు ఆశీర్వదించిన ప్రత్యేకమైన కార్యక్రమం అని మంత్రి తెలిపారు.. ఇలా రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు మనం బలం చేకూర్చాల్సిన అవసరం ఉందని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com