Tuesday, May 13, 2025

ఎజెండా ఖరారు

హైదరాబాద్‌లో ఏపి, తెలంగాణ సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, ఏ. రేవంత్‌ రెడ్డి భేటీ సందర్భంగా ఎజెండా ఖరారు అయింది. షెడ్యూల్ 9 లోని ఆస్తుల విభజన, షెడ్యూల్ 10 లోని ఆస్తుల విభజన చట్టంలో పేర్కొనబడని ఆస్తుల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ అంశం, విద్యుత్ బకాయిల అంశం, 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల మధ్య అప్పుల పంపిణీ, ఉద్యోగుల మార్పిడి, లేబర్‌ సెస్ పంపినీపై చర్చించనున్నారు. ఉమ్మడి సంస్థల ఖర్చు సొమ్మును తిరిగి చెల్లించడం, హైదరాబాద్‌లో 3 భవనాల పంపకాలు నిలుపుదల అంశం తేలనున్నది. మొత్తం 91 సంస్థలలో 89 సంస్థల కేంద్ర సముదాయాల పంపిణీకి షీలా బేడీ కమిటీ సిఫారసులు చేయగా, ఈసీ సిఫారసు లలో 68 సంస్థల విషయంలో తెలంగాణ అంగీకారం తెలిపింది. కాగా ఈ భేటీలో ఏపీ నుంచి సీఎం నారా చంద్రబాబు నాయుడు, సీఎస్, ముగ్గురు మంత్రులు, ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు, మంత్రులు అనగాని సత్య ప్రసాద్, జనార్ధన్‌ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరుకానున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com