Sunday, May 11, 2025

చిత్తూరు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

అమరావతి: చిత్తూరు జిల్లా మొగ‌లి ఘాట్ వ‌ద్ద జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో 7 గురు మృతి చెంద‌డంపై సీఎం చంద్ర‌బాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి బెంగుళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీ నీ డీకొన్న ఘటనలో 7 గురు ప్రాణాలు కోల్పోగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం….సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాల‌ను ప్రభుత్వం ఆదుకుంటుందని అని తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com