తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న ప్రమాణ స్వీకారానంతరం ఆయన తన కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లారు. అటు తరువాత వైకుంఠం ద్వారా చంద్రబాబు ఆలయంలోకి ప్రవేశించనున్నారు. సంప్రదాయ వస్త్ర ధారణతో చంద్రబాబు,లోకేష్,దేవాన్ష్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకి ఇస్తికఫాల్ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు.