నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సీఎం ఎక్కిన లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించింది. చాలా సమయం లిఫ్ట్ కదల్లేదు. దీంతో ఏం జరుగుతుందో తెలియక అధికారులు టెన్షన్ కు గురయ్యారు. హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ అధికారులు వెంటనే అప్రమత్తమై లిఫ్ట్ ఓపెన్ చేయడంతో ప్రమాదం తప్పింది. సీఎంను వేరే లిఫ్ట్ లో సెకండ్ ఫ్లోర్ కు తీసుకువెళ్లారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎనిమిది మంది మాత్రమే ఎక్కాల్సిన లిఫ్ట్ లోకి 13 మందిని ఎలా పంపారనే విషయంలో సెక్యూరిటీ సిబ్బందిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.