Friday, May 9, 2025

నేడు సీఈసీ సమావేశానికి సిఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టిల హాజరు

నాలుగు పెండింగ్ స్థానాలపై చర్చ
సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీలు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. నేడు ఢిల్లీలో జరిగే సమావేశంలో వారు పాల్గొననున్నారు. సీఈసీ సమావేశంలో భాగంగా తెలంగాణకు సంబంధించి మిగిలిన నాలుగు లోక్‌సభ స్థానాల అభ్యర్థులకు సంబంధించి అధిష్టానంతో వారు చర్చించనున్నారు. రెండు రోజులుగా నియోజకవర్గాల నేతల అభిప్రాయాలను స్క్రీనింగ్ కమిటీ సేకరించింది. కాగా, ఇప్పటికే 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. నేటితో ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులెవరో క్లారిటీ రానుంది. దీంతోపాటు సికింద్రాబాద్ అభ్యర్థిగా ఇప్పటికే దానం నాగేందర్‌ను ఏఐసిసి ప్రకటించగా, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే ఆయన స్థానంలో వేరే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ అభ్యర్థుల జాబితా నేడు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com