Friday, April 18, 2025

హైదరాబాద్ అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఉంది

  • రాజులు ఏ రంగంలోనైనా రాణిస్తారు
  • వారి శ్రమ, పట్టుదలే దానికి కారణం
  • క్షత్రియులకు తప్పకుండా గుర్తింపునిస్తాం
  • క్షత్రియుల అభినందన సభలో సిఎం రేవంత్

హైదరాబాద్ అభివృద్ధిలో క్షత్రియులు కూడా భాగస్వాములేనని, క్షత్రియులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని సిఎం రేవంత్ అన్నారు. క్షత్రియుల పాత్ర ఎంతో ఉందని, రాజులు ఏ రంగంలోనైనా రాణిస్తారు. అందుకు వారి శ్రమ, పట్టుదలే కారణమని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందన సభ ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక మంత్రి బోసురాజు, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జరగడానికి ముందు వేదికపై ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సిఎం రేవంత్‌రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్ణంరాజు అని, ఇప్పుడు హాలీవుడ్‌తో పోటీ పడేలా రాణిస్తోంది బాహుబలి ప్రభాస్ అని ఆయన అన్నారు. ప్రభాస్ కఠోరమైన శ్రమ, పట్టుదల కారణంగానే వివిధ రంగాల్లో క్షత్రియులు రాణించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బోసురాజు అత్యంత క్రియాశీల పాత్ర పోషించారని, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోయినా పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేశారని, పార్టీ కోసం కష్టపడిన బోసురాజుని రాహుల్ గాంధీ గుర్తించారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. వారి నిబద్ధతకు ప్రాధాన్యతనిస్తూ వారిని మంత్రిని చేశారన్నారు.

నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు కచ్చితంగా
నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు ఉంటుందనడానికి బోసురాజు, శ్రీనివాస వర్మ ఒక ఉదాహరణ అని, మీలో రాజకీయాల్లో రాణించాలని ఉన్నవాళ్లను మీరు ప్రోత్సహించాలని వారికి తప్పకుండా అవకాశం కల్పిస్తామని క్షత్రియ సోదరులకు మాట ఇస్తున్నానని సిఎం రేవంత్ తెలిపారు. మీ తరపున తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుగా శ్రీనివాస రాజు ఉన్నారని, మీ సమస్యలను వారి ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సిఎం రేవంత్ అన్నారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కో చైర్మన్‌గా శ్రీనివాసరాజును నియమించామని, ఇది క్షత్రియులపై తమకున్న నమ్మకానికి నిదర్శనమని ఆయన తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం స్పూర్తితో మేం ప్రజా సమస్యలపై కొట్లాడామన్నారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని రాజులకు తాను పిలుపునిస్తున్నానని, రండి, ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం, క్షత్రియ భవన్‌కు కావాల్సిన స్థలం, అవసరమైన సహకారం తమ ప్రభుత్వం అందిస్తుందని సిఎం రేవంత్ క్షత్రియులకు పిలుపునిచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com