హైదరాబాద్‌ను భారతదేశానికి క్రీడా రాజధానిగా మార్చాలన్నదే నా ప్రయత్నం
ఫుట్ బాల్ టోర్నమెంట్ 2024ను ప్రారంభించిన సిఎం రేవంత్
నాలుగు దేశాల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) హైదరాబాద్‌లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను భారతదేశానికి క్రీడా రాజధానిగా మార్చాలన్నదే తమ ప్రయత్నమన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్ కాంటినెంటల్ కప్ (4వ ఎడిషన్) ఫుట్ బాల్ టోర్నమెంట్ 2024ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు.
ఈ టోర్నమెంట్‌లో ఇండియా, మారిషస్, సిరియా దేశాలు పాల్గొంటున్నాయి. మంగళవారం ఇండియా వర్సెస్ మారిషస్ మ్యాచ్ జరుగుతుండగా ఈనెల 06వ తేదీన మారిషస్ వర్సెస్ సిరియా మ్యాచ్ సెప్టెంబర్ 9వ తేదీన ఇండియా వర్సెస్ సిరియా మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ ప్రియుల తరపున, ప్రజల తరపున సిఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు.