Thursday, December 26, 2024

బ్యాంకుల ముందు మోకరిల్లుతున్న సీఎం రేవంత్‌

మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ తప్పుడు లెక్కలు: ఎమ్మెల్సీ కవిత

మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తప్పుడు సమాధానాలు చెబుతోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ‌హయాంలో రుణం కోసం ఏనాడూ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదని పేర్కొన్నారు. కానీ సీఎం రేవంత్‌ ‌రెడ్డి మాత్రం ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. ఈ మేరకు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కల్వకుంట్ల కవిత కీలక విషయాలను బయటపెట్టారు. మూసీ పరీవాహక ప్రాంతంలో పేద ప్రజల నుంచి భూములు లాక్కొని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి రియల్‌ ఎస్టేట్‌ ‌చేయాలని అనుకుంటున్నారని కల్వకుంట్ల కవిత విమర్శించారు.
ఈ మేరకు ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబర్‌ 19‌న‌ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించిందని అన్నారు. ఆ ప్రతిపాదనల్లో మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌ప్రాజెక్టు అని స్పష్టంగా రాసి ఉందని తెలిపారు. కానీ మంత్రి శ్రీధర్‌బాబు మాత్రం మూసీ ప్రాజెక్టు కాదు.. మురుగునీటి శుద్ధికి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణాన్ని కోరామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com