Friday, November 8, 2024

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఘనంగా నివాళ్లు అర్పించిన సిఎం రేవంత్

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిల సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఇందిరాగాంధీ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రాపటాలకు పూలమాల వేసి సిఎం పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన అతీతమైన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. సర్దార్ పటేల్ సేవలను స్మరిస్తూ జరుపుకునే జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

స్థానాల విలీనం ద్వారా స్వాతంత్య్ర భారతదేశ సార్వభౌమత్వానికి నిండుదనాన్ని చేకూర్చిన ఉక్కుమనిషి సర్దార్ పటేల్‌ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. అలాగే దేశం కోసం సర్వస్వం ధారపోసిన మహానీయురాలు ఇందిరా గాంధీ అని ఆయన అన్నారు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, 20 సూత్రాల కార్యక్రమం వంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ప్రగతికి, పేదల అభ్యున్నతికి ఇందిరా గాంధీ ఎంతగానో కృషి చేశారని ఆయన గుర్తుచేశారు. స్వర్గీయ ఇందిరాగాంధీ స్పూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొని మహానీయులకు నివాళులు అర్పించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular