Tuesday, December 24, 2024

ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు

ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్‌పై సిఎం రేవంత్ స్పందన
కులగణన కార్యక్రమం చేపట్టిన ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కులగణన కార్యక్రమం చేపట్టంపై ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుపై స్పందించిన రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రారంభమైన కుల గణన సర్వేతో విప్లవ యాత్రకు శ్రీకారం చుట్టామని సిఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

తమ నాయకుడు రాహుల్ గాంధీ వాగ్దానం ప్రకారం తెలంగాణలో అన్ని బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేశారని స్పష్టం చేశారు. ఇక ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని సిఎం రేవంత్ చెప్పారు. అంతేగాక సామాజిక న్యాయం కోసం తదుపరి కార్యక్రమాలు, విధానాలతో భారతదేశంలో అగ్రస్థానంలో ఉండేలా తాము రాబోయే రోజుల్లో తీవ్రంగా కృషి చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com